ఆయన ఉదయానే నిద్ర లేపేవారు:బాబు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతి దానిని వివాదం చేయాలని చూస్తున్నారని ఆంధ్ర ప్రదేష్ సి.ఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని కధనం. తెలంగాణ టిడిపి నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో తాను చేసిన ఒక వ్యాఖ్యను సమర్ధించుకున్నారని సమాచారం వచ్చింది. ఎన్.టి.రామారావు వచ్చాకే హైదరాబాద్ లో ఉదయానే నిద్ర లేపేవారని తాను చేసిన వ్యాఖ్యలలో తప్పు ఏముందని ఆయన అన్నారని చెబుతున్నారు. కెసిఆర్ ప్రతి అంశాన్ని వివాదం చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారని టిడిపి వర్గాలు చెప్పినట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వివాదం, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలతో పాటు ఆయా అంశాలపై తెలంగాణ నేతలతో చర్చించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ కావాలనే వివాదం చేస్తున్నారని, ఆ పథకాన్ని మీరు అడ్డుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని, తాము వాస్తవాలు వివరిస్తూ దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నామని టిడిపి నేతలు వివరించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై పోరాడాలని కూడా ఆయన సలహ ఇచ్చారని వార్తలు సూచిస్తున్నాయి.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








